Thursday, August 19, 2010

అమ్మాయి తలపులు

ఆగని హృదయపు పరవళ్లు
ఆగమన్న సమజాపు కట్టుబాట్లు
ఆపినా ఆగని వయసు పోకడలు
అత్త... అమ్మ కాదు అని తెలియని
కొత్త పెళ్లికూతురి
ఆగమన పెళ్ళి తలపులు, తీయని వలపులు......
అమ్మ, నాన్న, అన్న, చెల్లి, పాత బంధాల నుండి.....
అత్త, మామ, బావ, వదిన కొత్త బంధాల ముడి ......
అంతు తెలియని ప్రేమ పాత బంధాలవైతే .......
లోతు తెలియని పగ కొత్త బంధాలవి ......
అంతు ఎరుగని, లోతు తెలియని ......
కొత్త పెళ్లి కూతురి .....
ఆగమన పెళ్లి తలపులు.. తీయని వలపులు

ఆట, చదువు,అన్నం,నిద్ర అన్నీ చూసుకొనే అమ్మ ......
వంటా, వార్పు, ఊడ్పు, ఊద్యోగం అన్నీచెప్పే అత్త .....
ఆలనా, పాలనా, తెగని మురిపాలను పంచే నాన్న
అధికారం, ధర్పం, అహం చుపే మామ .......
తనకి ఆశ కలిగినప్పుడే కనిపించే 'భర్త'

పాపం యేమి తెలియని ఎరుగని
కొత్త పెళ్లి కూతురి ....
ఆగమన పెళ్లి తలపులు.. తీయని వలపులు.....


No comments:

Post a Comment