Monday, August 16, 2010

ప్రేమ జల్లు

కలల భావనలా కరిగి పోకుమా.....
చిరు జల్లులా వచ్చి వడగళ్ళ వానలా మారిపోకుమా.....
గ్రహణం పట్టిన మామ మోమును తలపనీయకుమా.....
ఆమని ఆగమనానికి వేచే కనులను కాయలుగా చేయకుమా.....
అమ్మని వీడే అమ్మాయి కళావిహీనపునగు మొములా కాక.....
జీవితాంతం ప్రియుని కలయికని తలచే మధుర స్మృతిలా ......
మధురాతి మధుర అతిమధురమైన నిష్కల్మష చిరునవ్వులా.....
హృదయ పులకింతల సమ్మోహన రాగాలను హృదయాంతరాలకు చేరేలా.....
మనస్సు గిలిగింతల ఆనంద రాగాల ప్రేమ జల్లును కురిపించుమా ......
దొరికిన నీ దరహాసం దొరకి కూడ దక్కని ధనము.....
దొరకని నీ హాసము నా జీవితాంతము నరకము.....
దరి చేరకపోయినా..... నీ దరహాసమును అందించు .....
ధరిత్రినే జయించే దాసుడనౌత..... నీ ప్రేమ దాసుడునౌత .......

No comments:

Post a Comment