సమాజము అంటేనే జన సమూహం కదా! ఆ జనంలో జీవించి, ఆ జనంలో బ్రతికి ఆ జనం మేళవించే జీవితపు అనురాగలత అనుబంధ లత అయిన స్నేహలత కోసం చేతులు చాచితే నీవు అందించేది యేమిటి? మనం జనంలోనే బ్రతకాలి కదా! అంటే జనం, మనం ఒకటే. ప్రేమను ప్రేమించు, ప్రేమకై స్నేహన్ని అందించు స్నేహలత పెరుగుటకై అంతేకానీ నీ స్వార్దం కోసం, నీపబ్బం గడుపుట కోసం లేదా నీ కాలం గడవడం కోసం స్నేహాన్ని చేసి స్నేహలతకి కళంకం రానీయకు.
గమ్యం కోసం పరిగీడుతున్నాము అని తలచే తల్లిదండ్రులారా! మీ గమ్యాల కోసం మీ పిల్లల భవిష్యత్ ని అగమ్యం చేయవద్దు. ఉమ్మడి కుటుంబాలలో రాని, తెలియని ఈ సమస్య ఇప్పుడెందుకు తలెత్తుతుంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువైనందుకా! ఉమ్మడి కుటుంబాలు లేనందుకా! ఒకరో, ఇద్దరో పిల్లలు అయినందుకా! ఈ తప్పెవరిది!
"గురువు" గురువుని బ్రహ్మతోని, విష్ణుతోని పోలుస్తు శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రుల తరువాత స్థానాన్ని కల్పించారు. ఆ గురువుకి మనం ఇస్తున్న విలువ ఎంత? గురుకులాల్లో గురువుతో కలిసి చదివే రోజులు పోయి, గురువుని మన కాళ్ళ దగ్గరకి రప్పించే రోజులు వచ్చాయి. మన అవసరానికి గురువు అందుబాటులో ఉన్న రోజులు ఇవి. గురువు పిల్లలకి అందిస్తున్న విద్యా లోపమా! విధానలోపమా!ఒక గురువు ఒక శాస్త్రం గురించి తెలిపేందుకు చేస్తున్న కృషి దాని ఫలితం అందరికీ తెలిసిందే, ఐతే మానవ విలువలు నిలిపేందుకు చేస్తున్న కృషి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కోరుకునే మన పిల్లలు తల్లిదండ్రులకి గాని, గురువులకిగాని ఎంత ప్రేమ, గౌరవాలని అందిస్తున్నారు? ఇది ఎవరిలోపం? ఇంటి వాతావరణమా? సమాజ లోపమా? ఈ అయోమయ స్థితిలో పిల్లలు స్నేహాన్ని, ప్రేమని కోరుకుంటే, ఆ పిల్లలకి జరుగుతున్న ఈ నీచమైన స్థితికి బాధ్యులు ఎవరు?
తేనే అంత మాధుర్యాన్ని
నీరు అంత నిర్మలత్వాన్ని
పాలు అంత పవిత్రతని
చవిచూపే ఈ స్నేహలత
ప్రస్తుత స్థితిలో చిన్నబోదా???!!!

హాయ్ మాడమ్
ReplyDeleteస్నేహాం కోసం, గురువుకివ్వాల్సిన గౌరవం, తల్లిదండ్రుల కోసం, సమాజంలో జరుగుతున్న నీచమైన కార్యాల కోసం చాలా చక్కగా రాసారు. కాకపోతే ఈ విషయంలో నా అభిప్రాయం , ఏ పని, అది మంచిదే కానివ్వండి, చెడ్డదే అవనివ్వండి, మన నుంచి కొంచెమైనా ప్రోత్సాహం లేకుంటే జరుగుతుందా! మన చేతలో, మన రాతలో, లేదా మన ప్రమేయమో, మన మనస్సులో ఆలోచనో, ఏదో ఒకటి మన పనులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ మనమే బాధ్యులం. కనీస ఆలోచన జ్ఞానం ఉండి కూడా ఆలోచనా రహితంగా ప్రవర్తించే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు నిజంగా జాగ్రత్త వహించాల్సిందే. అదే విధంగా మరి అమ్మాయిల విషయంలో కూడా అందరూ ముఖ్యంగా అబ్బాయిలు కూడా జాగ్రతా వహించాల్సిందే, ఎందుకన్నానంటే ముందే చెప్పాగా ఏది జరిగినా అందులో మన పాత్ర, బాధ్యత కూడా ఉంటుంది. అమ్మాయిలు, అందరు అమ్మాయిలను అని కాకపోయినా, చాలా ఎక్కువ శాతం అమ్మాయిలు ఈ రోజుల్లో, అందరూ తెలివైన వారే కదా! అలా వాళ్ళు చనువు ఇవ్వకుండా అబ్బాయిలు అలా ప్రవర్తించగలరా! అంతా అయిపోయాక తల్లిదండ్రులకు వాళ్ళకనుగుణంగా ఏదో చెప్పేసే ఈ అమ్మాయిలు ఎవరో ఏదో అంటే, అలా అనిన వెంటనే మాత్రం చెప్పరు, ఈ రోజుల్లో సిటీ కల్చర్ అంటూ, మోడర్న్ యుగం అంటూ వాళ్ళ వేషభాషలు, దుస్తులు, మన సంప్రదాయం ఎక్కడ కనబడుతుంది చెప్పండి, ఆ హావభావాలు, నడిచే తీరు, ప్రవర్తన, ఒకరికి ఒకరేం తక్కువ అన్నట్టు ప్రవర్తించడం, మాట తీరు కూడా, ఎదుటివారిని రెచ్చగొట్టేట్టు మాట్లాడడం, అసలేం మాట్లాడుతున్నారో వారికే తెలుస్తుందో లేదో, అసలు చదువుకుంటూ, ఇంకా ఎంతో సాధించాల్సిన వయసులో ఏదో సాధించేసిన వారిలా, అసలు ఒక ఇందిరా గాంధీని, ఓ కిరణ్ బేడీని, ఓ సుధా మూర్తిని, ఇలా ఎంతో మంది, ఇప్పుడున్న అమ్మాయిల్లా వారుంటే మనకి స్ఫూర్తిగా తీసుకునేందుకు ఎవరూ ఉండరేమో.
చివరిగా స్నేహం పేరుతో ఎదో ఒకే రీతిన అమ్మాయిలే మోసపోవట్లేదు, అబ్బాయిలు కూడా ఎందరో ఉన్నారని నేననుకుంటున్నాన్ను, ఇక ఇలాంటి నీచమైన పనులను అరికట్టేందుకు ఒకటే మార్పు రావాలి. ఎవరి ప్రవర్తన వల్ల ఇలాంటి దుస్థితి కలుగుతుందో, వాళ్ళ ప్రవర్తనలో రావాలి మార్పు, వారిలో మార్పుకు ముఖ్యంగా బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం ప్రథమంగా తల్లిదండ్రులే, తరువాత గురువులు.
అందుకే గా,
మాతృదేవో భవ!
పితృ దేవో భవ!
ఆచార్య దేవో భవ!