మధుమూర్తి
Friday, December 23, 2011
Friday, January 7, 2011
కాలమా నీ తప్పు సరిదిద్దుకొ
కాలము వొడిలో కరిగిపోయే గుండె చప్పుడులు...
కలవని మనసుల కలయికతో కాలము గెలుపు...
గెలవని మనసులు విరహబాధతో హ్రుదయ రోదనలు ...
గెలిచె విజయగర్వంతో కాలం విహాంగము...
చెదిరిన మనసులు మునుపెన్నడు ఎరుగని "మండేగుండెలై"
ఎవరిని ఎందుకు కలిపావో, ఎవరిని ఎందుకు విడగోడతావో అనే
ఎదురు ప్రశ్నలు వేయలేని ఙీవనవోడిలో సతమతమవుతు ...
గజిబిజి జీవితంతో గడపలేక, గత గుర్తులుగంటలు మ్రోగినట్లు
గుండెలలో చేస్తున్నమోతలు...
కలవనిమనసులతో సహఙీవనానికి సహకరించకున్నాయి...
సమాజపు కట్టుబాట్లు కూడా ఆపలేకున్నవి...
కాలమా! ఇప్పుడైనా నీతప్పుని సరిదిద్దుకో ...
కలిసేమనసులనే కలిపే ప్రయత్నం చేయి...నీ తప్పు ఇంకొకతప్పుకి ఆస్కారము కల్పించకు...

Monday, September 6, 2010
తొలగిపో నేస్తమా!!!
మేఘాల మాటు నుండి తొంగి చూడకుమా...నీ అరకొర వాడి చూపులకు నిలువలేకున్నా...
ఎందున నిలిపినా.. నామనస్సు పరిగీడుతుంది నీయందే...
నిలువని నా మనస్సు నా భవితను భగ్నం చేస్తుంది...
ఇంద్రధనస్సు వర్ణాలకి మయూరిలా నాట్యం చేయకుమా...
నీ వయ్యారి నడక హొయసోయగాలు...
నా మది కదిలికలకు మూలకారణాలు...
నా జీవితపుగమ్యపు వినాశనాలు...
ఆమనిలో కూసే కోయిలవి కాకుమా...
నీమాట, పాటల చతురతకు ముగ్దుడనవుతున్నా....
నీ వలపు తలపులలో..
తల్లి తలంపులను వమ్ము చేస్తున్నా...
వసంతపు పూల అత్తరులను వెదజల్లకుమా...
నీ పరిమళాల మత్తులో చిత్తునవుతున్నా...
ఆ మతి భ్రమణలో...
జీవితపు లక్ష్యాలను చేరలేకున్నా...
కలల ప్రపంచములో తేలియాడితే...
నాన్న కలలు కల్లలవుతున్నాయి...
అమ్మ ఆశలు అడియాశలవుతున్నాయి...
అస్థిర జీవిత పయనమవుతుంది...
అందుకే తొలగిపో..
నా హృదయం నుండి తొలగిపో నేస్తమా...
Sunday, September 5, 2010
సుప్రభాతం చూద్దాం రండి....

రండి రండి కదలి రండి నే చెప్పే మాటలకు నా వెనుక రండి...
లక్ష్యాల, గమ్యాల సాధనకు పరుగీడుతూ ముందుకురండి...
కనిపించే ముల్లులను, కనిపించని ముల్లులను దాటుకుంటూ రండి...
పూలబాట వెదుకులాటకు సాగిరండి....
లక్ష్యాల, గమ్యాల సాధనకు పరుగీడుతూ ముందుకురండి...
కనిపించే ముల్లులను, కనిపించని ముల్లులను దాటుకుంటూ రండి...
పూలబాట వెదుకులాటకు సాగిరండి....
క్షణికావేశానికి లోనుకాక మధుమాసం కోసం చూడండి...
వివేకవంతులై వసంతంని వెదకండి...
బేల, బిత్తర చూపులు విడిచి అభయంగారండి...
దొరకనిది చేదుగా తలచి...
దొరికినది మధురంగా భావించి ముందుకురండి...
వివేకవంతులై వసంతంని వెదకండి...
బేల, బిత్తర చూపులు విడిచి అభయంగారండి...
దొరకనిది చేదుగా తలచి...
దొరికినది మధురంగా భావించి ముందుకురండి...
సందేహించకు నేస్తమా!!
బాధపడకు మిత్రమా!!
నా చేయి అందుకొనుము, నా పిలుపు వినుము,
నీ బాధ పంచుకొనుము.....
హృదయం పిండిన విషయమైన...
మనస్సుని ముంచిన సారాంశమైన...
జగము అల్లకల్లోలమైన...
కలలు కరిగి పోయినా....
బాధపడకు మిత్రమా!!
నా చేయి అందుకొనుము, నా పిలుపు వినుము,
నీ బాధ పంచుకొనుము.....
హృదయం పిండిన విషయమైన...
మనస్సుని ముంచిన సారాంశమైన...
జగము అల్లకల్లోలమైన...
కలలు కరిగి పోయినా....
కోరికలు నెరవేరకపోయినా...
తూట్లు పొడిచే మాటలు పడినా...
తల ఎత్తుకోలేని అవమానం కలిగినా...
తీవ్రమైన తిరస్కారం ఎదురైన...
పాతాళంలోకి కూరుకుపోతున్నా...
మిన్నువిరిగి మీద పడినా...
కాలనాగుల విషవలయంలో చిక్కుకున్నా...
తూట్లు పొడిచే మాటలు పడినా...
తల ఎత్తుకోలేని అవమానం కలిగినా...
తీవ్రమైన తిరస్కారం ఎదురైన...
పాతాళంలోకి కూరుకుపోతున్నా...
మిన్నువిరిగి మీద పడినా...
కాలనాగుల విషవలయంలో చిక్కుకున్నా...
ఆశలు అడియాసలైనా...
అనుకున్నది సాధించలేకపోయినా...
అంగవైకల్యం ఏర్పడినా...
ఆస్తి నష్టం వాటిల్లినా...
అయినవాళ్ళు అందరూ పోయినా...
మొదటి మెట్టునుండి మళ్లీ మొదలీడుదాం...
చిరుదివ్వెలను వెలుగించుదాం...
ఆత్మహత్యా ప్రయత్నాలని సమాధి చేద్దాం...
జీవితపు చివరి అంచుల వరకూ పయనిద్దాం...
సుప్రభాతం కొరకు వేచి చుద్దాం రండి..
అనుకున్నది సాధించలేకపోయినా...
అంగవైకల్యం ఏర్పడినా...
ఆస్తి నష్టం వాటిల్లినా...
అయినవాళ్ళు అందరూ పోయినా...
మొదటి మెట్టునుండి మళ్లీ మొదలీడుదాం...
చిరుదివ్వెలను వెలుగించుదాం...
ఆత్మహత్యా ప్రయత్నాలని సమాధి చేద్దాం...
జీవితపు చివరి అంచుల వరకూ పయనిద్దాం...
సుప్రభాతం కొరకు వేచి చుద్దాం రండి..
(ఇటీవల 07/08/2010 న ఆత్మహత్య చేసుకొని మరణించిన మా విద్యార్థికి
కవితా నివాళులు అర్పిస్తూ, అక్కడేవుండి ఏమి చేయలేని నా
అసమర్ధతకు చింతిస్తూ,ఇంకెవరు ఆ ప్రయత్నం చేయకూడదు
అని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీ మధు.)
కవితా నివాళులు అర్పిస్తూ, అక్కడేవుండి ఏమి చేయలేని నా
అసమర్ధతకు చింతిస్తూ,ఇంకెవరు ఆ ప్రయత్నం చేయకూడదు
అని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీ మధు.)
Sunday, August 22, 2010
అమ్మా బాగున్నాను!!!!
అమ్మా బాగున్నాను చాలా బాగున్నాను.....మనసున్నవాడిని నే కోరితే.....
బంగారు బొమ్మనే ఇచ్చే నీ ఉదారం.....
ఇక సంగతులకి వెళ్తే....
ఉదయం అన్నం వార్పు చేయి మీద పడి
చేయి కాలినా.... మంట లేదమ్మా .....
కానీ మంటగా వుందమ్మా .....
ఉత్తి పుణ్యానికి పాలవాడితో నవ్వినందుకు...
చేయి కాలినా.... మంట లేదమ్మా .....
కానీ మంటగా వుందమ్మా .....
ఉత్తి పుణ్యానికి పాలవాడితో నవ్వినందుకు...
మా అత్తపెట్టిన వాతలు......
కాయగూరలు కోస్తూ, కోసుకు పోయిన నా చేయి కోత .....
కోసినట్లు లేదమ్మా......
కానీ గుండె కోసినట్లు ఉందమ్మా.....
పెళ్ళి లో మామగారి తరుపువాళ్ళకి మర్యాద జరగ లేదని ......
మామగారి దెప్పుళ్ళు.......
కోసినట్లు లేదమ్మా......
కానీ గుండె కోసినట్లు ఉందమ్మా.....
పెళ్ళి లో మామగారి తరుపువాళ్ళకి మర్యాద జరగ లేదని ......
మామగారి దెప్పుళ్ళు.......
పండగ కి కొన్న కొత్త చెప్పులు....
తడబాటు నడకకి బెండు అయి నా పాదం వాపు....
తడబాటు నడకకి బెండు అయి నా పాదం వాపు....
వాచినట్లుగా లేదమ్మా....
కాని వాచిపోయాయమ్మా....
అత్త చెప్పుడు మాటలకు నా బంగారు బొమ్మ బెల్టు దెబ్బలు.....
కాని వాచిపోయాయమ్మా....
అత్త చెప్పుడు మాటలకు నా బంగారు బొమ్మ బెల్టు దెబ్బలు.....
ఉద్యోగ హడావిడిలో ...
తలుపులో పడిన నా వేళ్ళు, నొప్పిగా లేవమ్మా....
కాని నొప్పిగా ఉందమ్మా....
పక్కింటి పిన్ని తో "బంగారం లాంటి సంబంధాలు వదిలి
దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాను" అంటున్న మా అత్త మాటలు.....
తలుపులో పడిన నా వేళ్ళు, నొప్పిగా లేవమ్మా....
కాని నొప్పిగా ఉందమ్మా....
పక్కింటి పిన్ని తో "బంగారం లాంటి సంబంధాలు వదిలి
దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాను" అంటున్న మా అత్త మాటలు.....
సభ లో పరధ్యానంగా వున్నానని.....
బాసు తిట్టిన తిట్లు బాధ గా లేవమ్మా....
కాని బాధగా వున్నాయమ్మా.....
నాతోనే మెలుగుతూ, నా వెనుక అన్నతో....
చాడీలు చెప్పుతున్న మరదలి మాటలు ....
బాసు తిట్టిన తిట్లు బాధ గా లేవమ్మా....
కాని బాధగా వున్నాయమ్మా.....
నాతోనే మెలుగుతూ, నా వెనుక అన్నతో....
చాడీలు చెప్పుతున్న మరదలి మాటలు ....
బస్సు తప్పిపోతుందేమోనన్న తొందరలో....
దుమ్ము కళ్ళల్లో పడినా, మంట లేదమ్మా....
కాని మంటగా వుందమ్మా....
నా మనస్సుతో నిమిత్తం లేకుండా ...
నా బంగారు బొమ్మ కోరిక తీరుస్తూ నా నిద్రలేమి కళ్ళు.....
దుమ్ము కళ్ళల్లో పడినా, మంట లేదమ్మా....
కాని మంటగా వుందమ్మా....
నా మనస్సుతో నిమిత్తం లేకుండా ...
నా బంగారు బొమ్మ కోరిక తీరుస్తూ నా నిద్రలేమి కళ్ళు.....
కళ్ళు తిరుగుతూ, అన్నం సహించక నీరసంగా వున్నా...
నీరసం లేదమ్మా..........
ఆ మధుర అనుభూతిని బంగారు బొమ్మ తో పంచుకొనుటకు వెలుతూ....
ప్రక్క గదిలో " దీనికి తిండి పెట్టడమే దండగ ఇంకొకరికి కూడానా" అనే
ఇంకా జన్మించని నా పాపకి పెట్టే శాపనార్థాలు......
నీరసం లేదమ్మా..........
ఆ మధుర అనుభూతిని బంగారు బొమ్మ తో పంచుకొనుటకు వెలుతూ....
ప్రక్క గదిలో " దీనికి తిండి పెట్టడమే దండగ ఇంకొకరికి కూడానా" అనే
ఇంకా జన్మించని నా పాపకి పెట్టే శాపనార్థాలు......
కుప్ప కులే నీరసాన్ని తెచ్చాయమ్మా.....
ఇంటా... బయటా పని ఒత్తిడితో
నా తల చాలా భారంగా వున్నా, భారం అనిపించట్లేదు....
కాని భారంగా ఉందమ్మా....
కాఫీ కప్పు అందిస్తున్న నా చేతి వేళ్ళ తాకిడికి ...
తహ తహ లాడే బావగారి వెకిలి వేషాలు....
ఆ తప్పుని కూడా నా మీదే వేస్తారేమోనని....
పెదవి విప్పని నా హృదయభారం... చాలా భారంగా వుందమ్మా...
బాగోలేనమ్మా...అసలేం బాగోలేనమ్మా, నా మనసేమి బాగోలేదమ్మా.....
కాని బాగున్నానమ్మా....
నీవు అందించినది సామాన్యుడిని కాదుగదా .....
బంగారు బొమ్మని, బంగారు బొమ్మకి మనసెక్కడిది?
అందరూ వున్నా ఏకాకినై ఏమీ చేయలేని,
కనీసం ఈ జాబుని కూడా పంపలేని నిస్సహాయురాలిని.....
ఎందుకంటే నా బాధ చూచి నీవుపడే,
బాధని తట్టుకోలేను ...
అందుకే అమ్మా....
బాగున్నాను... చాలా బాగున్నాను.....
Thursday, August 19, 2010
అమ్మాయి తలపులు
ఆగని హృదయపు పరవళ్లుఆగమన్న సమజాపు కట్టుబాట్లు
ఆపినా ఆగని వయసు పోకడలు
అత్త... అమ్మ కాదు అని తెలియని
కొత్త పెళ్లికూతురి
ఆగమన పెళ్ళి తలపులు, తీయని వలపులు......
అమ్మ, నాన్న, అన్న, చెల్లి, పాత బంధాల నుండి.....
అత్త, మామ, బావ, వదిన కొత్త బంధాల ముడి ......
అంతు తెలియని ప్రేమ పాత బంధాలవైతే .......
లోతు తెలియని పగ కొత్త బంధాలవి ......
అంతు ఎరుగని, లోతు తెలియని ......
కొత్త పెళ్లి కూతురి .....
ఆగమన పెళ్లి తలపులు.. తీయని వలపులు

ఆట, చదువు,అన్నం,నిద్ర అన్నీ చూసుకొనే అమ్మ ......
వంటా, వార్పు, ఊడ్పు, ఊద్యోగం అన్నీచెప్పే అత్త .....
ఆలనా, పాలనా, తెగని మురిపాలను పంచే నాన్న
అధికారం, ధర్పం, అహం చుపే మామ .......
తనకి ఆశ కలిగినప్పుడే కనిపించే 'భర్త'
వంటా, వార్పు, ఊడ్పు, ఊద్యోగం అన్నీచెప్పే అత్త .....
ఆలనా, పాలనా, తెగని మురిపాలను పంచే నాన్న
అధికారం, ధర్పం, అహం చుపే మామ .......
తనకి ఆశ కలిగినప్పుడే కనిపించే 'భర్త'
పాపం యేమి తెలియని ఎరుగని
కొత్త పెళ్లి కూతురి ....
ఆగమన పెళ్లి తలపులు.. తీయని వలపులు.....
కొత్త పెళ్లి కూతురి ....
ఆగమన పెళ్లి తలపులు.. తీయని వలపులు.....
Monday, August 16, 2010
ప్రేమ జల్లు
కలల భావనలా కరిగి పోకుమా.....చిరు జల్లులా వచ్చి వడగళ్ళ వానలా మారిపోకుమా.....
గ్రహణం పట్టిన మామ మోమును తలపనీయకుమా.....
ఆమని ఆగమనానికి వేచే కనులను కాయలుగా చేయకుమా.....
అమ్మని వీడే అమ్మాయి కళావిహీనపునగు మొములా కాక.....
జీవితాంతం ప్రియుని కలయికని తలచే మధుర స్మృతిలా ......
మధురాతి మధుర అతిమధురమైన నిష్కల్మష చిరునవ్వులా.....
హృదయ పులకింతల సమ్మోహన రాగాలను హృదయాంతరాలకు చేరేలా.....
మనస్సు గిలిగింతల ఆనంద రాగాల ప్రేమ జల్లును కురిపించుమా ......
దొరికిన నీ దరహాసం దొరకి కూడ దక్కని ధనము.....
దొరకని నీ హాసము నా జీవితాంతము నరకము.....
దరి చేరకపోయినా..... నీ దరహాసమును అందించు .....
ధరిత్రినే జయించే దాసుడనౌత..... నీ ప్రేమ దాసుడునౌత .......

Subscribe to:
Posts (Atom)